Saturday, June 10, 2017

నీ తలపులో...

నీ చూపు నా మనసును చేరి నా గుండె చప్పుడుని పెంచింది
నీ నవ్వుల చిరుజల్లు నా వెన్నంటి నను నీ ఊహల వరదతో ముంచెత్తింది

కలలు కన్ను మూయగానే వచ్చిపడుతూ నిను నా చెంత చేరుస్తుంటే
మనసు మాట రాని మౌనమై ఆ మధుర క్షణాలను మరల చూపిస్తుంటే

ఆపగలవా ఈ హృదయాన్ని నీకై ఆలోచించడం
చేయగలవా ఈ అబద్దాన్ని అందమైన నిజం!!

1 comment:

Unknown said...

wow superb sailaja..:)