ఏమని చెప్పను నేస్తం... ఏమని చెప్పను...
మదిలో మెదిలే మధుర భావన నీవనా
మనసు పలికే మౌన రాగం నీవనా
ఆలోచనా సంద్రంలో ఎగసిపడే జ్ఞాపకాల అలవు నీవనా
అలవోకగా తేలివచ్చే ఆమని పాటవు నీవనా
అరుదైన ఆత్మీయతకు రూపం నీవనా
అంతులేని అభిమానానికి ప్రతిరూపం నీవనా
ఏమని చెప్పను నేస్తం
ఇన్ని ఊసులను భరిస్తున్నమౌనానికి అర్థం అడిగితే
ఏమని చెప్పను... ఎలా చెప్పను...!!
1 comment:
Manchi hrudhayam kalavaarini choodadam arudhu
Manchi hrudhayam kalavaaritho sambhaashinchadam adhrushtam
Manchi hrudhayam kalavaaritho sneha bandham oka varam..great to have you as wonderful friend Sailaja
Post a Comment